Posts

Showing posts from July, 2018

9 నుంచి ఎడ్‌సెట్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ జారీ

9 నుంచి ఎడ్‌సెట్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ జారీ EDSET Counseling notification issued since 9th హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలోని బీఈడీ సీట్ల భర్తీకి ఈ నెల 9 నుంచి ఎడ్‌సెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభిస్తున్నారు. ఈ మేరకు శుక్రవారం షెడ్యూల్‌తోపాటు నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఈ నెల 9 నుంచి 13 వరకు సర్టిఫికెట్ల పరిశీలన, 10 నుంచి వెబ్‌ఆప్షన్ల ఎంపిక ప్రారంభమవుతుందని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. ఎన్సీసీ, స్పోర్ట్స్, క్యాప్, పీహెచ్ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ఈ నెల 11 నుంచి కొనసాగించనున్నారు. పూర్తి వివరాలు http:// టeducet.tsche.ac.in లేదా edcetadm.tsche.ac.in వెబ్‌సైట్‌లో చూడవచ్చని ఎడ్‌సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ మధుమతి తెలిపారు. నేటినుంచి ఎంసెట్ రెండో విడుత కౌన్సెలింగ్ రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో సీట్ల భర్తీకి శనివారం నుంచి సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభిస్తారు. ఈ నెల పదో తేదీ వరకు వెబ్‌కౌన్సెలింగ్ కొనసాగుతుందని ఎంసెట్ కన్వీనర్ నవీన్‌మిట్టల్ తెలిపారు. 1వ ర్యాంకు నుంచి 98 వేల ర్యాంకులు సాధించినవారు పాల్గొనడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. స్

ఎస్‌బీఐ డిబెట్ కార్డ్ పిన్ పొందండిలా...

ఎస్‌బీహెచ్ బ్యాంకు వినియోగదారులకు డిబెట్ కార్డు గడువు తేదీ ముగిసిన అనంతరం కొత్తగా ఎస్‌బీఐ డిబెట్ కార్డు వస్తుంది. దానికి సంబంధించిన పిన్ నంబర్‌ను మనం బ్యాంకు బ్రాంచ్‌కు వెళ్లి తీసుకోవాల్సి ఉంటుంది. ఏటీఎం కార్డు మనకు చేరుతుంది కాని బ్యాంకు బ్రాంచ్‌కు ఏటీఎం పిన్ చేరడం లేదు. ఎన్నిసార్లు వెళ్లిన వినియోగదారులకు ఇంకా మీ ఏటీఎం పిన్ రాలేదనే సమాధానం బ్యాంకు సిబ్బంది నుంచి వస్తుంది. దీనికి విడుగుడుగా మనం ఇంటర్‌నెట్, ఏటీఎం, ఐవీఆర్ ద్వారా ఏటీఎం డిబెట్ కార్డు పిన్ పొందవచ్చు. ఎలాగంటే... ఎస్‌ఎంఎస్ ద్వారా డిబెట్ కార్డు పిన్: స్టెప్ 1: మీరు బ్యాంకులో నమోదు చేసిన ఫోన్ నెంబర్ నుంచి కింది విధంగా 567676 నెంబర్‌కు ఎస్‌ఎమ్‌ఎస్ పంపించండి PINXXXXYYYY *XXXX ఉన్న ప్రాంతంలో డిబెట్ కార్డుపై ఉన్న చివరి నాలుగు అంకెలు *YYYY ఉన్న ప్రాంతంలో మీ అకౌంట్‌లోని చివరి నాలుగు అంకెలు నమోదు చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు: PIN 7891 1234 స్టెప్ 2: మీరు బ్యాంకులో నమోదు చేసుకున్న సెల్‌ఫోన్ నెంబర్‌కు నాలుగు అంకెల వన్ టైమ్ పాస్ వర్డ్ వస్తుంది. ఈ పాస్‌వర్డ్‌ను ఓటీపీ వచ్చిన 48 గంటల్లో వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఐవీఆర్ ద్వా

నేషనల్‌ మీన్స్‌ కమ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌

మట్టిలోని మాణిక్యాలకు ఉపకారం * నేషనల్‌ మీన్స్‌ కమ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ * ప్రభుత్వ, ఎయిడెడ్‌, స్థానిక సంస్థల, కేజీబీవీ పాఠశాలల విద్యార్థులు అర్హులు విద్యార్థుల్లోని ప్రతిభ వెలుగు చూడకపోవడానికి పేదరికం, ఆర్థిక సమస్యలు ప్రధాన కారణాలు. పుస్తకాలు, కనీస సౌకర్యాలు లేక చదవలేకపోవడం లేదా మధ్యలోనే బడి మానేయడం వంటి వాటిని నివారించడానికి కేంద్ర ప్రభుత్వం ఏటా లక్షమందికి స్కాలర్‌షిప్‌లను అందిస్తోంది. రాత పరీక్షలో మెరిట్‌ సాధిస్తే నాలుగు విద్యా సంవత్సరాల వరకు మట్టిలోని మాణిక్యాలకు ఈ ఉపకారం అందుతుంది. ఉన్నత పాఠశాల స్థాయిలో ఆర్థికంగా వెనుకబడిన ప్రతిభావంతులైన విద్యార్థులను ఆదుకోడానికి, డ్రాపవుట్లను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం ‘నేషనల్‌ మీన్స్‌ కమ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ (ఎన్‌ఎంఎంఎస్‌)’ పథకాన్ని అమలు చేస్తోంది. దేశవ్యాప్తంగా లక్ష ఉపకారవేతనాలను కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. అందులో తెలంగాణ రాష్ట్రానికి దాదాపు మూడువేలు, ఆంధ్రప్రదేశ్‌కి నాలుగువేలకు పైగా అందుతున్నాయి. రాష్ట్రాల వారీగా నిర్ణీత పద్ధతిని అనుసరించి ఉపకారవేతనాల సంఖ్యను నిర్ణయిస్తారు. ఆయా రాష్ట్రాల నిబంధనలను అనుసరించి రిజర్వేషన్లు అమలు చేస

ఎస్జీటీ పోస్టుల్లో బీఈడీ అభ్యర్థులకు అవకాశం

ఎస్జీటీ పోస్టుల్లో బీఈడీ అభ్యర్థులకు అవకాశం: గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన ఎన్‌సీటీఈ................ 1. సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ(ఎస్జీటీ) పోస్టులకు బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్(బీఈడీ) పూర్తి చేసిన అభ్యర్థులకు అవకాశం కల్పిస్తూ సవరించిన గెజిట్ నోటిఫికేషన్‌ను జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి(ఎన్‌సీటీఈ) విడుదల చేసింది. 2. SGT పోస్టుకు ఎంపికైనవారు రెండేళ్లలోపు ఎన్‌సీటీఈ గుర్తింపు పొందిన ప్రాథమిక విద్యలో ఆరు నెలల బ్రిడ్జ్ కోర్సు పూర్తి చేయాల్సి ఉంటుందని గెజిట్‌లో పేర్కొంది. 3. గతంలో బీఈడీ చేసినవారు కేవలం పాఠశాల సహాయకులు(ఎస్ఏ) పోస్టులకు మాత్రమే అర్హులుగా ఉండేవారు. 4. ఎన్‌సీటీఈ గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం ఇప్పుడు బీఈడీ చేసినవారు అటు ఎస్జీటీ, ఇటు పాఠశాల సహాయకుల పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. 5. 2008 డీఎస్సీ సమయంలో 30% ఎస్జీటీ పోస్టులను డీఈడీ చేసినవారికే కేటాయించారు. మిగతా 70 శాతం పోస్టులను డీఈడీ, బీఈడీ చేసినవారికి మెరిట్ ప్రాతిపదికన ఇచ్చారు. 6. 2010లో సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో 2012 డీఎస్సీ నుంచి ఎస్జీటీ పోస్టులను వందశాతం డీఈడీ చేసినవారితోనే భర్తీ చేస్తున్నారు. 7. రాష్ట్ర విభజన అనంతరం

తెలంగాణ గురుకులాల్లో 2932 టీచర్‌ పోస్టులు

తెలంగాణ గురుకులాల్లో 2932 టీచర్‌ పోస్టులు: తెలంగాణ ఏర్పడిన తరవాత విద్యపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. కేజీ టూ పీజీ ఉచిత విద్యా విధానాన్ని చేపట్టింది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల కోసం ప్రత్యేక గురుకులాల స్థాపనకు నడుం బిగించింది. ఇప్పుడు ఉన్న వాటికి అదనంగా 119 గురుకులాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభిస్తోంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇవన్నీ పని చేసేలా సర్కారు చర్యలు తీసుకుంటోంది. ఈ గురుకులాల్లో ఒక్కో విద్యార్థిపై ఏటా 1.05 లక్షల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. తెలంగాణలోని వివిధ గురుకుల సొసైటీల ఆధ్వర్యంలో నడుస్తున్న గురుకుల విద్యాలయాల్లో టీచర్‌ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్‌ను తెలంగాణ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు(టిఆర్‌ఈఐ-ఆర్‌బి) విడుదల చేసింది. మొత్తం 2932 పోస్టులున్నాయి. వీటిలో ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌(టిజిటి) 960, పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్‌(పిజిటి) 1972 పోస్టులున్నాయి. ఎంపికైన అభ్యర్థులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, సాధారణ గురుకుల సొసైటీల ఆధ్వర్యంలో నడుస్తున్న గురుకుల్