9 నుంచి ఎడ్‌సెట్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ జారీ

9 నుంచి ఎడ్‌సెట్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ జారీ
EDSET Counseling notification issued since 9th


హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలోని బీఈడీ సీట్ల భర్తీకి ఈ నెల 9 నుంచి ఎడ్‌సెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభిస్తున్నారు. ఈ మేరకు శుక్రవారం షెడ్యూల్‌తోపాటు నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఈ నెల 9 నుంచి 13 వరకు సర్టిఫికెట్ల పరిశీలన, 10 నుంచి వెబ్‌ఆప్షన్ల ఎంపిక ప్రారంభమవుతుందని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. ఎన్సీసీ, స్పోర్ట్స్, క్యాప్, పీహెచ్ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ఈ నెల 11 నుంచి కొనసాగించనున్నారు. పూర్తి వివరాలు http:// టeducet.tsche.ac.in లేదా edcetadm.tsche.ac.in వెబ్‌సైట్‌లో చూడవచ్చని ఎడ్‌సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ మధుమతి తెలిపారు.

నేటినుంచి ఎంసెట్ రెండో విడుత కౌన్సెలింగ్
రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో సీట్ల భర్తీకి శనివారం నుంచి సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభిస్తారు. ఈ నెల పదో తేదీ వరకు వెబ్‌కౌన్సెలింగ్ కొనసాగుతుందని ఎంసెట్ కన్వీనర్ నవీన్‌మిట్టల్ తెలిపారు. 1వ ర్యాంకు నుంచి 98 వేల ర్యాంకులు సాధించినవారు పాల్గొనడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. స్పెషల్ క్యాటగిరీ విద్యార్థులు సాంకేతిక విద్యాభవన్‌లోని సహాయకేంద్రంలో శనివారం సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరుకావాలని పేర్కొన్నారు.

Comments

Popular posts from this blog

DRDO Scholarships to Girls 2019

నేషనల్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌

How to Apply for IBPS POs Recruitment