Posts

Showing posts from November, 2017

విద్యార్థుల విజ్ఞాన యాత్రకు ప్రభుత్వ అనుమతి

విద్యార్థుల విజ్ఞాన యాత్రకు ప్రభుత్వ అనుమతి: పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు విజ్ఞాన, వినోద యాత్రలు చేసేందుకు ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలతో కూడిన అనుమతి ఇచ్చింది. ఇన్నాళ్లూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు విహార యాత్రలు వెళ్లేందుకు అనుమతి లేదు. అన్ని కోణాలనుంచి ఆలోచించిన తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల మేధస్సు పెరగడానికి, ముఖ్యమైన ప్రదేశాలపై అవగాహన కలగడానికి విజ్ఞాన విహారయాత్రలు అవసరమని తెలిపింది. ఈ దిశలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు అనుమతితో విద్యార్థులను యాత్రకు తీసుకెళ్లొచ్చని సూచించింది. కాగా, ప్రభుత్వం విధించిన నిబంధనలు విధిగా పాటించాలని స్పష్టంచేసింది. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను ప్రకటించింది. మార్గదర్శకాలు 1. తెలంగాణలోని ఏ ప్రాంతానికైనా వెళ్లవచ్చునని, కానీ రాష్ట్రం దాటకూడదని అందులో తెలిపారు. 2. జనవరిలోపు ఈ యాత్రలు పూర్తిచేయాలని నిర్ధేశించింది. 3. మరోవైపు విద్యార్థులను ప్రోత్సహించేందుకు రూ.1.64కోట్లు విహారయాత్రకు విడుదల చేసింది తెలంగాణ వ్యాప్తంగా 1963పాఠశాలలు ఉన్నాయి. 4. వీరిలో 9, 10 తరగతి విద్యార్థులకు విజ్ఞాన, విహార యాత్రలకు అనుమతి ఇచ్చింది. 5. 100