విద్యార్థుల విజ్ఞాన యాత్రకు ప్రభుత్వ అనుమతి

విద్యార్థుల విజ్ఞాన యాత్రకు ప్రభుత్వ అనుమతి:
పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు విజ్ఞాన, వినోద యాత్రలు చేసేందుకు ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలతో కూడిన అనుమతి ఇచ్చింది. ఇన్నాళ్లూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు విహార యాత్రలు వెళ్లేందుకు అనుమతి లేదు. అన్ని కోణాలనుంచి ఆలోచించిన తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల మేధస్సు పెరగడానికి, ముఖ్యమైన ప్రదేశాలపై అవగాహన కలగడానికి విజ్ఞాన విహారయాత్రలు అవసరమని తెలిపింది. ఈ దిశలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు అనుమతితో విద్యార్థులను యాత్రకు తీసుకెళ్లొచ్చని సూచించింది. కాగా, ప్రభుత్వం విధించిన నిబంధనలు విధిగా పాటించాలని స్పష్టంచేసింది. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను ప్రకటించింది.

మార్గదర్శకాలు
1. తెలంగాణలోని ఏ ప్రాంతానికైనా వెళ్లవచ్చునని, కానీ రాష్ట్రం దాటకూడదని అందులో తెలిపారు.
2. జనవరిలోపు ఈ యాత్రలు పూర్తిచేయాలని నిర్ధేశించింది.
3. మరోవైపు విద్యార్థులను ప్రోత్సహించేందుకు రూ.1.64కోట్లు విహారయాత్రకు విడుదల చేసింది
తెలంగాణ వ్యాప్తంగా 1963పాఠశాలలు ఉన్నాయి.
4. వీరిలో 9, 10 తరగతి విద్యార్థులకు విజ్ఞాన, విహార యాత్రలకు అనుమతి ఇచ్చింది.
5. 100మంది విద్యార్థులు ఉన్న పాఠశాల నుంచే ఈ విహారయాత్రకు వెళ్లాలనే నిబంధన విధించింది.
6. ఈ యాత్రకు ఒక్కో పాఠశాల నుంచి కేవలం 40మంది విద్యార్థులు మాత్రమే వెళ్లాలని సూచించింది.
7. ఒక్కో విద్యార్థికి రూ.200ఖర్చు చేయొచ్చని, 15మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు టీం లీడర్గా ఉండాలని, విద్యార్థినులు ఉంటే మహిళా ఉపాధ్యాయులు ఉండాలని పేర్కొంది.
8. పాఠశాల విద్యా కమిటీతో చర్చించి యాత్రను ఎంపిక చేయాలని సూచించారు.

Comments

Popular posts from this blog

DRDO Scholarships to Girls 2019

నేషనల్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌

How to Apply for IBPS POs Recruitment