తెలంగాణ గురుకులాల్లో 2932 టీచర్‌ పోస్టులు

తెలంగాణ గురుకులాల్లో 2932 టీచర్‌ పోస్టులు:
తెలంగాణ ఏర్పడిన తరవాత విద్యపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. కేజీ టూ పీజీ ఉచిత విద్యా విధానాన్ని చేపట్టింది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల కోసం ప్రత్యేక గురుకులాల స్థాపనకు నడుం బిగించింది. ఇప్పుడు ఉన్న వాటికి అదనంగా 119 గురుకులాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభిస్తోంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇవన్నీ పని చేసేలా సర్కారు చర్యలు తీసుకుంటోంది. ఈ గురుకులాల్లో ఒక్కో విద్యార్థిపై ఏటా 1.05 లక్షల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేస్తోంది.

తెలంగాణలోని వివిధ గురుకుల సొసైటీల ఆధ్వర్యంలో నడుస్తున్న గురుకుల విద్యాలయాల్లో టీచర్‌ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్‌ను తెలంగాణ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు(టిఆర్‌ఈఐ-ఆర్‌బి) విడుదల చేసింది. మొత్తం 2932 పోస్టులున్నాయి. వీటిలో ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌(టిజిటి) 960, పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్‌(పిజిటి) 1972 పోస్టులున్నాయి. ఎంపికైన అభ్యర్థులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, సాధారణ గురుకుల సొసైటీల ఆధ్వర్యంలో నడుస్తున్న గురుకుల్లాల్లో పనిచేయాల్సి ఉంటుంది.

ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌(టిజిటి)
అర్హతలు
50 శాతం మార్కులతో బిఎ/బిఎస్సీ/బికాం ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/బీసీ/దివ్యాంగులకు కనీసం 45 శాతం మార్కులు వచ్చి ఉండాలి.
ఎన్‌సిటిఇ గుర్తింపు పొందిన విద్యా సంస్థ నుంచి మెథడాలజీతో సంబంధిత సబ్జెక్టులో బిఇడి ఉత్తీర్ణులై ఉండాలి. లేదా...
50 శాతం మార్కులతో నాలుగేళ్ల బిఎబిఇడి/బిఎస్సీ బిఇడి ఉత్తీర్ణులై ఉండాలి. బిఇడిలో కూడా ఎస్సీ/ఎస్టీ/బీసీ/దివ్యాంగులకు కనీసం 45 శాతం మార్కులు ఉంటే చాలు. లేదా..
50 శాతం మార్కులతో సంబంధిత భాష ఆప్షనల్‌గా డిగ్రీ ఉత్తీర్ణత లేదా బ్యాచిలర్‌ ఆఫ్‌ ఓరియెంటల్‌ లాంగ్వేజ్‌ లేదా గ్రాడ్యుయేషన్‌ ఇన్‌ లిటరేచర్‌, లాంగ్వేజ్‌ పండిత్‌ ట్రెయినింగ్‌ సర్టిఫికెట్‌/సంబంధిత భాషలో బిఇడి ఉత్తీర్ణత. ఎస్సీ/ఎస్టీ/బీసీ/దివ్యాంగులకు కనీసం 45 శాతం మార్కులు ఉంటే చాలు. తెలంగాణ స్టేట్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌(టిఎస్‌టెట్‌)/ఆంధ్రప్రదేశ్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌(ఏపీటెట్‌)/సెంట్రల్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌(సిటెట్‌)లకు చెందిన పేపర్‌-2లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. టిఎస్‌ టెట్‌ పేపర్‌-2లో ఉత్తీర్ణులైన వారికి 20 శాతం వెయిటేజీ లభిస్తుంది. అయితే 2014 జూన్‌ 2 కంటే ముందు నిర్వహించిన ఏపీటెట్‌ పేపర్‌-2 లో అర్హత సాధించినవారికి మాత్రమే 20 శాతం వెయిటేజీ లభిస్తుంది. 2014 జూన్‌ 2 తరవాత నిర్వహించిన ఏపీ టెట్‌లో ఉత్తీర్ణులైన వారికి ఎలాంటి వెయిటేజీ ఉండదు.
రాతపరీక్ష
రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పరీక్షలో మొత్తం మూడు పేపర్లు ఉంటాయి. ప్రశ్న పత్రం ఆబ్జెక్టివ్‌ టైప్‌లో ఉంటుంది. మొత్తం 300 మార్కులు ఉంటాయి. మూడు పేపర్లలో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌ లిస్ట్‌ చేస్తారు. పరీక్షలో నెగెటివ్‌ మార్కింగ్‌ విధానం ఉంటుంది. తప్పుడు సమాధానానికి 1/4 మార్కులు కట్‌ చేస్తారు. కాబట్టి అభ్యర్థులు సమాధానం కచ్చితంగా తెలిస్తేనే గుర్తించాలి. లేకుంటే ఆ ప్రశ్నను వదిలి వేయడం ఉత్తమం.
పేపర్‌-1(జనరల్‌ స్టడీస్‌): 100 ప్రశ్నలు ఇస్తారు. మొత్తం మార్కులు 100. సమయం 120 నిమిషాలు.
పేపర్‌-2(పెడగాగీ):100 ప్రశ్నలు ఇస్తారు. మొత్తం మార్కులు 100. సమయం 120నిమిషాలు.
పేపర్‌-2 (సబ్జెక్ట్‌ డిసిప్లిన్‌ నాలెడ్జ్‌/సంబంధిత సబ్జెక్టు): 100 ప్రశ్నలు ఇస్తారు. మొత్తం మార్కులు 100. సమయం 120 నిమిషాలు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు
చేసుకోవాలి
దరఖాస్తు ఫీజు: రూ.1200. ఎస్సీ,ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు రూ.600.
ఆన్‌లైన్‌లో దరఖాస్తు స్వీకరణ ప్రారంభం: 2018 జూలై 9 నుంచి
ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు చివరి తేదీ: 2018 ఆగస్టు 8
వెబ్‌సైట్‌: https://treirb.telangana.gov.in/

పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌(పిజిటి)
అర్హతలు
సంబంధిత సబ్జెక్టులో 50 శాతం మార్కులతో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/బీసీ/దివ్వాంగులకు 45 శాతం మార్కులు ఉంటే చాలు.
బిఇడి లేదా బిఎబిఇడి/బిఎస్సీ బిఇడి ఉత్తీర్ణులై ఉండాలి.
రీజనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ నుంచి రెండేళ్ల ఇంటిగ్రేటెడ్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి.
రాతపరీక్ష
రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పరీక్షలో మొత్తం మూడు పేపర్లు ఉంటాయి. ప్రశ్న పత్రం ఆబ్జెక్టివ్‌ టైప్‌లో ఉంటుంది. మొత్తం 300 మార్కులు ఉంటాయి. మూడు పేపర్లలో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌ లిస్ట్‌ చేస్తారు. పరీక్షలో నెగెటివ్‌ మార్కింగ్‌ విధానం ఉంటుంది. తప్పుడు సమాధానానికి 1/4 మార్కులు కట్‌ చేస్తారు. కాబట్టి అభ్యర్థులు సమాధానం కచ్చితంగా తెలిస్తేనే గుర్తించాలి. లేకుంటే ఆ ప్రశ్నను వదిలి వేయడం ఉత్తమం.
పేపర్‌-1(జనరల్‌ స్టడీస్‌): 100 ప్రశ్నలు ఇస్తారు. మొత్తం మార్కులు 100. సమయం 120 నిమిషాలు.
పేపర్‌-2(పెడగాగీ):100 ప్రశ్నలు ఇస్తారు. మొత్తం మార్కులు 100. సమయం 120 నిమిషాలు.
పేపర్‌-2(సబ్జెక్ట్‌ డిసిప్లిన్‌ నాలెడ్జ్‌/సంబంధిత సబ్జెక్టు): 100 ప్రశ్నలు ఇస్తారు. మొత్తం మార్కులు 100. సమయం 120 నిమిషాలు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తు ఫీజు: రూ.1200. ఎస్సీ,ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు రూ.600.
ఆన్‌లైన్‌లో దరఖాస్తు స్వీకరణ ప్రారంభం: 2018 జూలై 9 నుంచి
ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు చివరి తేదీ: 2018 ఆగస్టు 8
వెబ్‌సైట్‌: https://treirb.telangana.gov.in/

జనరల్‌ స్టడీస్‌ ప్రిపరేషన్‌ ఇలా...!
బేసిక్‌ ప్రొఫిషియెన్షీ ఇన్‌ ఇంగ్లీష్‌: అభ్యర్థి ఆంగ్ల పరిజ్ఞానాన్ని పరీక్షించే విధంగా ప్రశ్నలు ఉంటాయి. ఇంగ్లీ్‌షలో రాణించాలంటే వ్యాకరణంపై కనీస పరిజ్ఞానం సాధించాలి. కాంప్రహెన్షన్‌, వొకాబులరి, ఆంటోనిమ్స్‌, సినోనిమ్స్‌, వర్బ్స్‌, టెన్సెస్‌, వన్‌ వర్డ్‌ సబ్‌స్టిట్యూ షన్స్‌, ప్రిపోజిషన్స్‌, క్వశ్చన్‌ ట్యాగ్స్‌, ప్యాసేజెస్‌ వంటి ప్రశ్నలను ఎక్కువగా సాధన చేయాలి. రోజూ ఆంగ్ల పత్రికలను చదివి క్లిష్టమైన పదాలకు అర్థం తెలుసుకోవాలి.
జనరల్‌ ఎబిలిటీస్‌: ఈ విభాగంలో ముఖ్యంగా అనలిటికల్‌ ఎబిలిటీస్‌ అంటే లాజికల్‌ రీజనింగ్‌ అండ్‌ డేటా ఇంట్రప్రిటేషన్‌ నుంచి ఎక్కువగా ప్రశ్నలు వస్తాయి. అభ్యర్థులు బేసిక్‌ మేథ్స్‌పై అవగాహనను పెంచుకోవాలి. కూడికలు, తీసివేతలు, గుణాంకాలు, భాగహారంపై పట్టుసాధిస్తే ఈ విభాగంలో సులభంగా మార్కులు తెచ్చుకోవచ్చు. సంఖ్యామానం, సరాసరి, భాగస్వామ్యం, శాతాలు, లాభ నష్టాలు, సింపుల్‌ అండ్‌ కాంపౌండ్‌ ఇంటరెస్ట్‌, కాలం-పని, క్లాక్స్‌ అండ్‌ క్యాలెండర్స్‌, మెన్సురేషన్‌ వంటి ప్రశ్నలను ఎక్కువగా సాధన చేయాలి. వీటితో పాటు ఈ విభాగానికి సంబంధిం చిన టీచింగ్‌ ఆప్టిట్యూడ్‌పై కూడా పట్టు సాధించాలి.

జనరల్‌ సైన్స్‌: అంటువ్యాధులు, విటమిన్లు, బ్లడ్‌ గ్రూప్స్‌, ధ్వని, కాంతి, రసాయన నామాలు వంటివి చదవాలి. సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ అంశాలైన రక్షణ వ్యవస్థలోని యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు, జలాంతర్గాములు, క్షిపణులు, పరిశోధనలు వంటి వాటిపై అవగాహన పెంచుకొంటే సరిపోతుంది.

జాగ్రఫీ: దేశ, రాష్ట్ర నైసర్గిక స్వరూపాలు, నదులు, అడవులు, శీతోష్ణ స్థితి, ఖనిజ వనరులు, వ్యవసాయం, జనాభా, రవాణా సౌకర్యాలు వంటి వాటిని అధ్యయనం చేయాలి. వీటి కోసం తెలుగు అకాడమీ ఇంటర్‌ పుస్తకాలను చదవాలి.

పాలిటీ: ప్రాథమిక హక్కులు, రాజ్యాంగ సంస్కరణలు, ఎన్నికలు, మంత్రిమండలి, కేంద్ర, రాష్ట్ర పాలన వ్యవస్థలపై పట్టు పెంచుకోవాలి. వీటితో పాటు ఎథిక్స్‌, సెన్సివిటీ టు జెండర్‌ అండ్‌ వీకర్‌ సెక్షన్స్‌, సోషల్‌ అవేర్‌నెస్‌ వంటి అంశాలపై అవగాహన పెంచుకోవాలి.

జికె అండ్‌ కరెంట్‌ అఫైర్స్‌: అంతర్జాతీయ, జాతీయ సదస్సులు, అవార్డులు, బహుమతులు, క్రీడలు, విజేతలు, ప్రధాన నియామకాలు, ప్రముఖుల మరణాలు, పర్యటనలు వార్తల్లోని వ్యక్తులు, శాస్త్ర సాంకేతిక విశేషాలు, క్షిపణులు వంటి అంశాలపై దృష్టి కేంద్రీకరించాలి. వీటికోసం ప్రతి రోజూ వార్తా పత్రికలను తప్పనిసరిగా చదువుతూ అంశాలవారీగా నోట్సు రాసుకోవాలి. సమకాలీన అంశాలపై టీవీల్లో చర్చలను వీక్షిస్తూ అవసరమైన పాయింట్లను నోట్‌ చేసుకోవాలి. అలాగే పరీక్ష తేదీ కంటే ఆరు నెలల ముందటి వార్తా పత్రికలను కూడా తప్పని సరిగా చదవాలి.

తెలంగాణ అంశాలు: పై అన్నింటితో పాటు మరో ముఖ్యమైన అంశం తెలంగాణకు సంబంధించిన చారిత్రక, భౌగోళిక, సాంస్కృతిక, ఆర్థిక అంశాలు. ఉద్యోగం చేయబోయేది తెలంగాణలో గనుక ఈ రాష్ట్రానికి సంబంధించిన అన్ని అంశాల్లో సంపూర్ణ అవగాహన తప్పనిసరి. కాబట్టి తెలంగాణకు సంబంధించిన చరిత్ర, భౌగోళిక స్వరూపం ఎకానమీ, జనాభా, ప్రభుత్వ పథకాలు, విధానాలు, సంక్షేమ కార్యక్రమాలు వంటి అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. అదే విధంగా తెలంగాణ ఉద్యమానికి సంబంధించి తెలంగాణ భావన (1948-1970), సమీకరణ దశ(1971-1990), రాష్ట్ర అవతరణ దశ (1991-2014) వంటి అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన ఏ ఒక్క అంశాన్నీ వదిలిపెట్టకుండా అధ్యయనం చేయాలి.

Comments

Popular posts from this blog

DRDO Scholarships to Girls 2019

నేషనల్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌

How to Apply for IBPS POs Recruitment