ఎస్జీటీ పోస్టుల్లో బీఈడీ అభ్యర్థులకు అవకాశం
ఎస్జీటీ పోస్టుల్లో బీఈడీ అభ్యర్థులకు అవకాశం:
గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన ఎన్సీటీఈ................
1. సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ(ఎస్జీటీ) పోస్టులకు బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్(బీఈడీ) పూర్తి చేసిన అభ్యర్థులకు అవకాశం కల్పిస్తూ సవరించిన గెజిట్ నోటిఫికేషన్ను జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి(ఎన్సీటీఈ) విడుదల చేసింది.
2. SGT పోస్టుకు ఎంపికైనవారు రెండేళ్లలోపు ఎన్సీటీఈ గుర్తింపు పొందిన ప్రాథమిక విద్యలో ఆరు నెలల బ్రిడ్జ్ కోర్సు పూర్తి చేయాల్సి ఉంటుందని గెజిట్లో పేర్కొంది.
3. గతంలో బీఈడీ చేసినవారు కేవలం పాఠశాల సహాయకులు(ఎస్ఏ) పోస్టులకు మాత్రమే అర్హులుగా ఉండేవారు.
4. ఎన్సీటీఈ గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం ఇప్పుడు బీఈడీ చేసినవారు అటు ఎస్జీటీ, ఇటు పాఠశాల సహాయకుల పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
5. 2008 డీఎస్సీ సమయంలో 30% ఎస్జీటీ పోస్టులను డీఈడీ చేసినవారికే కేటాయించారు. మిగతా 70 శాతం పోస్టులను డీఈడీ, బీఈడీ చేసినవారికి మెరిట్ ప్రాతిపదికన ఇచ్చారు.
6. 2010లో సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో 2012 డీఎస్సీ నుంచి ఎస్జీటీ పోస్టులను వందశాతం డీఈడీ చేసినవారితోనే భర్తీ చేస్తున్నారు.
7. రాష్ట్ర విభజన అనంతరం 2014లో డీఎస్సీలోనూ ఎస్జీటీ పోస్టులను డీఈడీవారితోనే భర్తీ చేశారు.

Comments
Post a Comment